అంధుల క్రికెట్ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి మద్దతు
రిపోర్టర్: మహేష్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో అంధుల క్రికెట్ క్రీడను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భరోసా కల్పించారు. భారత అంధుల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, అర్జున అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి సోమవారం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో అంధ క్రీడాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రి తెలిపారు.