గుర్తింపు కార్డు లేకుండా గదులిస్తే కఠిన చర్యలు: సీఐలు
రిపోర్టర్: హరి
స్థలం: నిర్మల్
బాసరలో గుర్తింపు కార్డు లేకుండా లాడ్జి గదులను అద్దెకిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐలు రవీందర్ నాయక్, దీపక్ హెచ్చరించారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు పోలీసులు లాడ్జీలు, దాబాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అద్దెకు తీసుకున్న వారి వివరాలు రిజిస్టర్లో తప్పనిసరిగా నమోదు చేయాలని, అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని నిర్వాహకులను ఆదేశించారు.