తెలుగులో మాత్రమే మాట్లాడండి.. బిగ్ బాస్ హౌస్‌లో నాగార్జున సీరియస్ వార్నింగ్!

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

బిగ్ బాస్ సీజన్ 10 ఏడో రోజు ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్‌పై సీరియస్ అయ్యారు. ఇంగ్లీష్‌లో మాట్లాడితే చిరాకు వస్తోందని, తెలుగులోనే మాట్లాడాలని హితవు పలికారు. రోహిత్, షాలిని, సృష్టి ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారని మందలించారు. హౌస్‌లో అమన్, ముఖేష్, సృష్టి, నరేశ్ పర్మినెంట్ హౌస్‌మేట్స్‌గా కన్ఫర్మ్ అయ్యారు. పవర్ టాస్క్‌లో సుధీర్ విజయం సాధించి కొత్త పవర్ దక్కించుకున్నారు.