నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఏపీపీ రాత పరీక్ష ఫలితాలు విడుదల
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీ రాత పరీక్ష ఫలితాలను బోర్డు ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారని అధికారులు తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల పదిహేడో తేదీన సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి తమ ఇంటిమేషన్ లెటర్‌ను డౌన్లోడ్ చేసుకుని, ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు.