తక్కువ ధరకే టాటా టియాగో ఎలక్ట్రిక్ కారు కొనుగోలు చేసే అవకాశం
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు కంపెనీ నిపుణులు తెలిపారు. ఈ విధానం ద్వారా వాహనం కొనుగోలు చేసేటప్పుడు బ్యాటరీ మొత్తానికి ఒకేసారి డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. కేవలం కారు ధరను మాత్రమే వేరుగా చెల్లించి, బ్యాటరీ వినియోగానికి మాత్రం నెలవారీగా సబ్ స్క్రిప్షన్ రూపంలో చెల్లించే వెసులుబాటు ఉంటుందని వెల్లడించారు. దీనివల్ల ప్రారంభంలో కార్ల కొనుగోలుపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు స్పష్టం చేశారు.