రాయచోటిలో ఉద్రిక్తత: పంజాబ్ గ్యాంగ్ అరెస్ట్, ఆయుధాలు స్వాధీనం

రిపోర్టర్: మహేష్ స్థలం: రాయచోటి

అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్సార్సీపీ - టీడీపీ వర్గాల ఘర్షణ నేపథ్యంలో రెండోరోజు తీవ్ర ఉద్రిక్తత నెలకొందని పోలీసు అధికారులు తెలిపారు. పంజాబ్ నుంచి వచ్చిన నలుగురు సభ్యుల గ్యాంగ్ను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రివాల్వర్, పిస్టల్, ముప్పై బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికల్లో అల్లర్లు సృష్టించేందుకే వెలుపలి నుంచి ముఠాలను రప్పించారని, ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ స్పష్టం చేశారు.