బీహార్ ఎస్టీఈటీ డమ్మి అడ్మిట్ కార్డు విడుదల తేదీని ప్రకటించిన బోర్డు

రిపోర్టర్: కిరణ్ స్థలం: బీహార్

బీహార్ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఎస్టీఈటీ 2026 పరీక్షకు సంబంధించి డమ్మి అడ్మిట్ కార్డును సెప్టెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 22లోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సెప్టెంబర్ 30 వరకు అధికారిక పోర్టల్ ద్వారా వివరాలను సరిచూసుకోవచ్చని తెలిపింది. నవంబర్ మొదటి వారంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.