ప్రముఖ హాలీవుడ్ నటి అమండా సైఫ్రైడ్ విడాకులు.

రిపోర్టర్: రమేష్ స్థలం: World

ప్రముఖ హాలీవుడ్ నటి అమండా సైఫ్రైడ్, భర్త థామస్ సడోస్కీతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా తాము విడిగా ఉంటున్నామని, తమ కుటుంబానికి ఇదే సరైన నిర్ణయమని జాయింట్ స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశారు. 2017లో వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిద్దరి విడాకుల నిర్ణయం హాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.