జైలర్ సినిమాలో అవకాశంపై భావోద్వేగానికి గురైన నటి పూర్ణ
రిపోర్టర్: సునీల్
స్థలం: హైదరాబాద్
సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న జైలర్ రెండు చిత్రంలో స్పెషల్ సాంగ్ అవకాశం రావడంపై నటి పూర్ణ భావోద్వేగానికి గురయ్యారు. రజినీకాంత్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని కలలో కూడా ఊహించలేదని ఆమె తెలిపారు. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలను ఇష్టపడే తనకు, ఈ చిత్రంలో భాగమయ్యే అవకాశం రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని పూర్ణ తన భావాలను పంచుకున్నారు. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్‌కు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.