'లాభాల బాట పట్టాయి': వరుస నష్టాలకు బ్రేక్ వేసిన స్టాక్ మార్కెట్లు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు బ్రేక్ వేస్తూ బుధవారం లాభాల బాట పట్టాయి. ఎఫ్ఎంసీజీ, రియల్టీ, పీఎస్యూ బ్యాంకుల షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ 332.63 పాయింట్లు పుంజుకుని 74,336.45 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 99 పాయింట్లు లాభపడి 23,217.60 మార్కును తాకింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల ప్రకటన నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది.