రామ్లీలా మైదాన్ ర్యాలీ ఫోటోలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం

రిపోర్టర్: మహేష్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ రామ్లీలా మైదాన్ ర్యాలీలో భారీ జనసందోహం ఉన్నట్లు చూపించేందుకు కాంగ్రెస్ పార్టీ నకిలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలను వాడిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ చిత్రాలు పూర్తిగా అవాస్తవమని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాలు ఎప్పుడూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంటాయని బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించగా, ఆరోపణలను కాంగ్రెస్ నాయకులు ఖండించారు.