సినిమాల్లో లాగా నిజజీవితంలో సమస్యలు తీర్చలేమన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రిపోర్టర్: విజయ్
స్థలం: Rampachodavaram
సినిమాల్లో మాదిరిగా నిజ జీవితంలో సమస్యలను తక్షణమే పరిష్కరించడం సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దశాబ్దాలుగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి, మారుమూల గ్రామాల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన వెల్లడించారు.