మణిపూర్లో ఘోర హింస: కుకీ వర్గానికి చెందిన పదిహేను ఇళ్లు దగ్గ్ధం
రిపోర్టర్: సురేష్
స్థలం: Kamjong
మణిపూర్ రాష్ట్రంలోని కామ్జోంగ్ జిల్లాలో ఉగ్రవాదుల దాడితో ఉద్రిక్తత నెలకొందని, కుకీ వర్గానికి చెందిన పదిహేను ఇళ్లను దుండగులు దగ్ధం చేశారని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారని, స్థానికులు భయంతో సమీప అడవుల్లోకి ప్రాణభయంతో పారిపోయారని పోలీసులు వెల్లడించారు. భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయని, ఈ దారుణ ఘటనపై డిప్యూటీ సీఎం నెమ్చా కిప్జెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని అధికారులు పేర్కొన్నారు.