ఓటీటీలోకి తమిళ క్రైమ్ డ్రామా: అమెజాన్ ప్రైమ్ లో లెనిన్ పాండియన్ స్ట్రీమింగ్

రిపోర్టర్: సునీల్ స్థలం: తమిళనాడు

గంగై అమరన్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ క్రైమ్ డ్రామా చిత్రం లెనిన్ పాండియన్ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇసుక మాఫియా అక్రమాలు మరియు ఒక వృద్ధ రైతు ఆత్మగౌరవ పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి డి.డి. బాలచంద్రన్ దర్శకత్వం వహించారు. థియేటర్లలో మంచి విజయం సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరిస్తోందని తెలిపారు.