పింఛన్ల దరఖాస్తుల గడువు నేటితో ముగింపు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లాలో పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగియనుంది. మంగళవారం నాటికి జిల్లావ్యాప్తంగా 38,191 దరఖాస్తులు అందాయి. అయితే హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ సమస్యలు, సాంకేతిక లోపాలు, సదరం ధ్రువీకరణ వంటి అంశాల కారణంగా పలు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుండటంతో అర్హులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సాంకేతిక సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.