జమ్మూకశ్మీర్ రాజకీయాల్ లో సంచలనం: ఎంపీ పదవికి, ఎన్సీకి ఆగా రుహుల్లా రాజీనామా
రిపోర్టర్: అశోక్
స్థలం: శ్రీనగర్
జమ్మూకశ్మీర్ రాజకీయాల్ లో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి, శ్రీనగర్ లోక్సభ సభ్యత్వానికి ప్రముఖ షియా నేత ఆగా రుహుల్లా మెహదీ రాజీనామా చేశారు. తన తండ్రి వర్ధంతి వేడుకల్ లో భాగంగా బుద్గామ్ లో జరిగిన భావోద్వేగ సభలో ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటించారు. పార్టీ నాయకత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని తీవ్ర ఆరోపణలు చేస్తూ, నాలుగు పేజీల బహిరంగ లేఖను ఆయన విడుదల చేశారు.