రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతి బట్టబయలైందింటూ హరీశ్‌రావు ఆగ్రహం
రిపోర్టర్: శివ
స్థలం: Hyderabad
దానం నాగేందర్ అనర్హత వేటు వ్యవహారంలో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని బట్టబయలు చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన దానం నాగేందర్‌కు స్పీకర్ రక్షణ కవచంగా నిలవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. దేశమంతా రాజ్యాంగం గురించి మాట్లాడే రాహుల్‌గాంధీ కపట నాటకాలు ఈ ఘటనతో బయటపడ్డాయని, ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితో వెంటనే రాజీనామా చేయించాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు.