అధిక ధరలకు బియ్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ సిరికొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో రైస్ మిల్లర్లు, కిరాణా షాపుల యజమానులతో తహసీల్దార్ రవీందర్రావు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బియ్యం ధరలను స్పష్టంగా నిర్ణయించారు. నిబంధనలను ఉల్లంఘించి అధిక ధరలకు బియ్యాన్ని విక్రయిస్తే సంబంధిత వ్యాపారులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన గట్టిగా హెచ్చరించారు.