తిరుమలలో ఘనంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు మూడో రోజు వేడుకలు

రిపోర్టర్: విజయ్ స్థలం: తిరుమల

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహ వాహనంపై నరసింహమూర్తి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. తితిదే ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన 19 కళాబృందాలకు చెందిన 494 మంది కళాకారులు తమ సంప్రదాయ, జానపద కళారూపాలను ప్రదర్శించి భక్తులను విశేషంగా అలరించారు. రాత్రి ముత్యపు పందిరి వాహనంపై స్వామివారు తిరువీధుల్లో విహరించనున్నారు.