అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి పాకిస్థాన్ యత్నం: తెహ్రాన్ స్పష్టమైన తిరస్కరణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: టెహ్రాన్
అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య చర్చలకు పాకిస్థాన్ చేపట్టిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని, అణు కార్యక్రమంపై ఎలాంటి కొత్త రాయితీలు ఇచ్చేది లేదని ఇరాన్ తేల్చిచెప్పినట్లు అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్ సైనిక చీఫ్ అసిమ్ మునిర్ టెహ్రాన్ లోని ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయని, తమ దేశం నుంచి అణు ఇంధనాన్ని బయటకు తరలించే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది.