'చివరకు ఆ భారం వినియోగదారుడిపైనే పడుతుంది': సిద్ధార్థ్ దియాని కీలక వ్యాఖ్యలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: బెంగళూరు

యూపీఐ చెల్లింపులపై కొత్తగా మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. రూ.2,000 కంటే ఎక్కువ విలువైన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్ వర్తించనుండగా, దీనివల్ల భారం చివరకు సాధారణ వినియోగదారులపైనే పడే అవకాశం ఉందని బెంగళూరుకు చెందిన భారత్ అగ్రి సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సిద్ధార్థ్ దియాని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఫుడ్ డెలివరీ యాప్స్ విషయంలో జరిగినట్ట వ్యాపారులు ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేసే ప్రమాదముందని ఆయన అభిప్రాయపడ్డారు.