మండల స్థాయి క్రీడల్లో ఘర్కా విద్యాలయం విద్యార్థుల ప్రదర్శన

రిపోర్టర్: రమేష్ స్థలం: యాదాద్రి భువనగిరి

గట్టుప్పల్ మండల పరిధిలోని వెలమకన్నె గ్రామంలో జరిగిన మండల స్థాయి క్రీడా పోటీల్లో కలురామ్ ఘర్కా విద్యాదాయని విద్యాలయం విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. అండర్-17 కబడ్డీలో విజేతలుగా, ఖో ఖో, వాలీబాల్ విభాగాల్లో రన్నర్స్‌గా నిలిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా విజేతలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ అభినందించారు.