కేటీఆర్ చేతుల మీదుగా నూతన పాట ఆవిష్కరణ

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు గులాబీ పార్టీ కార్యవర్గంలో భాగంగా కేటీఆర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాతగా వ్యవహరించిన నూతన పాటను కేటీఆర్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సింగం విజయ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీలు గోవర్ధన్, అనిల్ కుమార్, జిల్లా నాయకులు నాగులు నాయక్, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.