గోల్డెన్ గ్లోబ్స్ నామినేషన్‌కు భారీ షాక్: మైఖేల్ జాక్సన్ బయోపిక్కు తిరస్కరణ
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
ప్రముఖ పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మైఖేల్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుల పోటీలో మ్యూజికల్ లేదా కామెడీ విభాగంలో చోటు నిరాకరించినట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. చిత్రంలో సంగీతం కథనాన్ని నడిపించే విధంగా లేదనే కారణంతో కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోల్డెన్ గ్లోబ్స్ కమిటీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ చిత్రం డ్రామా విభాగంలో పోటీ పడాల్సి వస్తుందని లయన్స్ గేట్ స్టూడియో తెలిపింది.