విజయనగరం ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల తీవ్ర అసంతృప్తి

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: విజయనగరం

విజయనగరం ఆర్టీసీ బస్టాండ్‌లో మౌలిక సదుపాయాల లోపంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐవీఆర్‌ఎస్‌ సర్వేలో తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై నెగిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చింది. రోజుకు వేలాది మంది రాకపోకలు సాగించే ఈ సముదాయంలో తాగునీరు, ఇతర సౌకర్యాలు సరిగా లేవని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై అధికారులు స్పందించి తక్షణమే వసతులు మెరుగుపరచాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.