పాంచ్కులా స్కూల్ దాడి ఘటన: ఎనిమిదేళ్ల బాలుడికి బెయిల్ మంజూరు చేసిన బోర్డు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: పాంచ్‌కులా

పాంచ్కులా పాఠశాలలో జరిగిన దాడి కేసులో ప్రమేయం ఉన్న ఎనిమిదేళ్ల బాలుడికి జువెనైల్ జస్టిస్ బోర్డు బెయిల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. బాలుడు ఎలాంటి మొబైల్ ఫోన్ వాడకుండా చూస్తామని, అతనికి కౌన్సెలింగ్ మరియు ప్రవర్తనా మార్పు తరహా చికిత్స అందిస్తామని తల్లిదండ్రులు హామీ ఇవ్వడంతో న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలను తొలగించాలని కూడా బోర్డు ఆదేశాలు జారీ చేసింది.