ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
ఎల్ నినో ప్రభావం మరియు తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లా అధ్యక్షులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. రైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని తీవ్రస్థాయిలో విమర్శించారు.