'ప్రజలకు మెరుగైన వైద్యం': కంటోన్మెంట్‌లో ఈటల రాజేందర్ వైద్య శిబిరం

రిపోర్టర్: వెంకట్ స్థలం: తిరుమలగిరి, సికింద్రాబాద్ కంటోన్మెంట్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను చేరువ చేయాలనే సంకల్పంతో ఈటల రాజేందర్ కీలక కార్యక్రమం చేపట్టారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఈటల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. పేద ప్రజల ఆరోగ్య రక్షణే లక్ష్యంగా బీజేపీ శ్రేణులు ఈ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు.