అంతర్జాతీయ గోల్‌షాట్‌బాల్‌ విజేత పూజితను అభినందించిన ఎమ్మెల్యే గంటా

రిపోర్టర్: వెంకట్ స్థలం: విశాఖపట్నం

భూటాన్‌లో జరిగిన అంతర్జాతీయ గోల్‌షాట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకి గ్రామానికి చెందిన తాతపూడి పూజితను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులో పూజిత మరిన్ని విజయాలు సాధించేందుకు తనవంతు పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు.