'గురుకులాల్లో కల్తీ సరుకులు': ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

రిపోర్టర్: హరి స్థలం: Telangana

గురుకుల పాఠశాలలకు కల్తీ సరుకులు పంపిణీ చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐపీఎల్ సీజన్ల లాగే గురుకుల కుంభకోణం కూడా ఎపిసోడ్లుగా బయటపడుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఈ కల్తీ సామాన్లతోనే భోజనం వండుతున్నారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.