జంతర్ మంతర్ వద్ద దాడి: స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్

రిపోర్టర్: వెంకట్ స్థలం: New Delhi

జంతర్ మంతర్ వద్ద సంజయ్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేసిన కేసులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌ను ఢిల్లీ పోలీసులు బులంద్‌షహర్‌లో అదుపులోకి తీసుకున్నారు. తాను బాధితుడి తల పగలగొట్టానని భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అయితే, అది సాధారణ గాయమేనని పోలీసులు స్పష్టం చేశారు. కాక్‌రోచ్ జనతా పార్టీ నిరసనల నేపథ్యంలో ఈ ఘటన రాజకీయంగా సంచలనం సృష్టించింది.