యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ భారం నుంచి చిరు వ్యాపారులకు ఊరట

రిపోర్టర్: మహేష్ స్థలం: India

యూపీఐ డిజిటల్ లావాదేవీలపై రెండు వేల రూపాయలకు మించి జరిగే చెల్లింపులకు మెర్చంట్ డిస్కౌంట్ రేట్ పై పద్దెనిమిది శాతం జీఎస్టీ వర్తిస్తుందనే వార్తలు చిరు వ్యాపారులలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎండీఆర్ పై జీఎస్టీ మినహాయింపు ప్రతిపాదనపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనివల్ల జీఎస్టీ పరిధిలోకి రాని చిన్న వ్యాపారులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరనుంది.