గడువుకు ముందే పారిస్ సదస్సు హామీలను నెరవేర్చిన భారత్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: న్యూఢిల్లీ

పారిస్ లో జరిగిన సీఓపీ21 సదస్సులో భారత్ ఇచ్చిన అన్ని హామీలను నిర్ణీత గడువుకు ముందే విజయవంతంగా నెరవేర్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ ఘనత సాధించిన ఏకైక జీ20 దేశంగా భారత్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో దేశం చేపట్టిన చర్యలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మోదీ పేర్కొన్నారు.