నంది వడ్డేమాన్ గ్రామంలో అత్యంత వైభవంగా దసరా వేడుకలు
రిపోర్టర్: కే జైపాల్
స్థలం: బిజినేపల్లి
నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల కేంద్రంలోని నంది వడ్డేమాన్ గ్రామంలో దసరా వేడుకలను పురస్కరించుకుని శమీ పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం గ్రామస్తులు యువత ఒకరికొకరు జమ్మి ఆకులను పంపిణీ చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.