కేసీఆర్ మా భూమి కబ్జా చేయలేదన్న బాధితులు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Erravelli
కేసీఆర్ మా భూమి కబ్జా చేశారంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధమని ఎర్రవెల్లి బాధితులు స్పష్టం చేశారు. సర్వే చేసిన అధికారులు నోటీసులు ఇస్తే అధికారులకు కూడా తాము అదే విషయం చెప్పామన్నారు. ఈ భూమిని వెనకటి నుండి దళితులే సాగు చేసుకుంటున్నారని, భూమికి సంబంధించిన అన్ని ఆధారాలను అధికారులకు అందజేస్తామని వారు స్పష్టం చేశారు.