డ్రాగన్ సినిమాకు రవి బస్రూర్ సంగీతం: స్పష్టం చేసిన ప్రశాంత్ నీల్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Hyderabad
స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ చిత్రానికి సంగీత దర్శకుడిగా రవి బస్రూర్ వ్యవహరిస్తున్నట్లు దర్శకుడు స్వయంగా స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్, సలార్ చిత్రాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మూడో ప్రాజెక్ట్ కావడంతో మ్యూజిక్ పై ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఈ సినిమాను పలు భాషలలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.