ఇరాన్ షరతులకు అంగీకరించకపోతే సర్వనాశనం చేస్తానంటూ ట్రంప్ హెచ్చరిక

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: అమెరికా

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాతో కొత్త ఒప్పందానికి అంగీకరించకపోతే ఇరాన్ను సర్వనాశనం చేస్తామని, నరకానికి పంపిస్తామని ఆయన మంగళవారం హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు సంపాదించకుండా నిరోధించడంలో అమెరికా చేపట్టిన యుద్ధం విజయవంతమైందని, షరతులకు తలొగ్గకపోతే మరిన్ని కఠినమైన సైనిక చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ కుండబద్దలు కొట్టారు.