హైదరాబాద్లో ఎల్బీనగర్ కారిడార్: కేంద్రమంత్రి గడ్కరీని కోరిన మంత్రి కోమటిరెడ్డి
రిపోర్టర్: విజయ్
స్థలం: Hyderabad
ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. గుజరాత్లో కేంద్రమంత్రితో భేటీ అయిన ఆయన, తూర్పు హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టును చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే వార్షిక ప్రణాళికలో దీనికి ఆమోదం తెలపాలని కోరినట్లు మంత్రి తెలిపారు.