ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: అశోక్
స్థలం: పెద్దపల్లి
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముగ్గురు సభ్యులున్న ఈసీలో నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీ అభిప్రాయం మేరకే జరగాలని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్న చర్యలను, ఓట్ల చోరీని తీవ్రంగా ప్రశ్నిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని గడ్డం వంశీకృష్ణ వెల్లడించారు.