అమెరికాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు

రిపోర్టర్: మహేష్ స్థలం: USA

అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం సెయింట్ లూయిస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ వాలీబాల్, త్రో బాల్ టోర్నమెంట్‌లలో ఐదు రాష్ట్రాల నుంచి 34 జట్లు, 275 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, అధ్యక్షుడు రాజ్ అల్లాడల అభినందనల నడుమ ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు.