కత్రినా కైఫ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థానీ ఆర్జే బహిరంగ క్షమాపణలు
రిపోర్టర్: శివ
స్థలం: ముంబై
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ పై ప్రెగ్నెన్సీ తర్వాత బరువు పెరిగారంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న పాకిస్థానీ ఆర్జే డాక్టర్ ఎజాజ్ వారిస్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. అంబానీ గణేష్ ఉత్సవాల్లో పాల్గొన్న కత్రినాపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ కావడంతో పాటు నటుడు సల్మాన్ ఖాన్ పరోక్షంగా మండిపడ్డారు. దీంతో తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసిన ఎజాజ్ వారిస్.. కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్ తో పాటు అభిమానులందరికీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా క్షమాపణ తెలిపారు.