హిందూపురంలో ఓటు హక్ కు వినియోగించుకున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
రిపోర్టర్: సునీల్
స్థలం: హిందూపురం
హిందూపురం మూడో వార్డులో సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. క్యూలైన్ లో నిలబడి ఎన్నికల అధికారులకు ఐడీ కార్డు చూపించి పోలింగ్ ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు. ఓటు ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్ కు అని, ప్రజలకు ఎవరైతే పని చేస్తారో వారికీ మాత్రమే ఓటు వేయాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికలు అత్యంత ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.