విమానంలో పవర్ బ్యాంక్ పేలుడు: శంషాబాద్లో ఇండిగో అత్యవసర ల్యాండింగ్
రిపోర్టర్: సురేష్
స్థలం: హైదరాబాద్
ఢిల్లీ నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంతో విమానంలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొనగా, అప్రమత్తమైన పైలట్లు వెంటనే స్పందించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారని, సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రాథమిక సమాచారం వెల్లడించింది.