ప్రపంచంలోనే ఏకైక విషపూరిత వానరం: ఎనుబది తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ప్రత్యక్షం

రిపోర్టర్: అశోక్ స్థలం: ఇండోనేసియా

ఇండోనేసియా అడవులలో దాదాపు ఎనుబది తొమ్మిదేళ్ల క్రితం కనుమరుగైపోయిందని భావించిన అరుదైన బంగ్కా స్లో లోరిస్ వానరం మళ్లీ కనిపించిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇది ప్రపంచంలోనే ఏకైక విషపూరిత వానర జాతిగా గుర్తింపు పొందిందని, విద్యుత్ తీగల వల్ల గాయపడిన వీటిని రెస్క్యూ సెంటర్ సిబ్బంది రక్షించి చికిత్స అందించారని తెలిపారు. అడవుల నరికివేత కారణంగా ఈ జీవులకు తీవ్రమైన ముప్పు పొంచివున్నట్లు శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.