చర్లపల్లి శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

రాబోయే పండగల సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. అక్టోబరు 6 నుంచి నవంబరు 25 వరకు ప్రతి మంగళ, బుధ వారాల్లో ఈ సర్వీసులు రాకపోకలు సాగిస్తాయని ద.మ.రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్‌ తెలిపారు. ఈ రైళ్లు నల్గొండ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ మీదుగా ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి.