స్థానిక సమరంపై వైఎస్సార్సీపీ కసరత్తు: మేయర్ అభ్యర్థుల ఎంపికపై జగన్ కీలక భేటీ

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ట్రావెల్/అమరావతి

ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకోవడంతో అభ్యర్థుల ఎంపికపై వైఎస్సార్సీపీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని పార్టీ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చేలా బలమైన నేతలను బరిలోకి దించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో కీలక సమీక్ష నిర్వహించనున్నారని వెల్లడించారు. మేయర్ అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.