నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదాలు: వేర్వేరు ఘటనల్లో ఇద్దరు దుర్మరణం
రిపోర్టర్: సునీల్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. నగరంలో ఇసుక ట్రాక్టర్ను మోటారు సైకిల్ ఢీకొన్న ఘటనలో మస్తానయ్య అనే వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వరికుంటపాడులో కారు డివైడర్ను ఢీకొన్న మరో ప్రమాదంలో డ్రైవర్ రవికుమార్ దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.