మోహన్‌లాల్ 'ఆపరేషన్ గంగా' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
రిపోర్టర్: అశోక్
స్థలం: India
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, దర్శకుడు విష్ణు మోహన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'L367' చిత్రానికి 'ఆపరేషన్ గంగా' అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారతీయులను స్వదేశానికి తరలించిన చారిత్రాత్మక మిషన్ నేపథ్యంలో ఈ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. అర్జున్ రాంపాల్, ఆదిల్ హుస్సేన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని శ్రీ గోకులం మూవీస్ నిర్మిస్తోంది.