ఉపన్యాస పోటీల్లో సత్తా చాటిన జన్నారం విద్యార్థులు
రిపోర్టర్: Gangadhar Reporter
స్థలం: జన్నారం
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో ఆకుల స్పందన ప్రథమ స్థానం సాధించగా, సేపూరి అలేఖ్య తృతీయ స్థానం దక్కించుకున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ చేతుల మీదుగా విద్యార్థులు అవార్డులు అందుకున్నారు. ఈ సందర్భంగా విజేతలను కళాశాల అధ్యాపకులు, తోటి విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు.