అంగారక యాత్రకు చారిత్రక అడుగు: ముగిసిన నాసా ప్రయోగం
రిపోర్టర్: అశోక్
స్థలం: Houston
అంగారక గ్రహంపై మానవ యాత్రను విజయవంతం చేసే లక్ష్యంతో నాసా చేపట్టిన సుదీర్ఘ ప్రయోగం విజయవంతంగా ముగిసింది. ఈ విషయాన్ని నాసా వైద్య అధికారి ఎలెన్ ఎల్లిస్ మీడియాకు వెల్లడించారు. అమెరికాలోని హ్యూస్టన్ లో గల జాన్సన్ స్పేస్ సెంటర్ లో నలుగురు వ్యోమగాములు ముై ఎనిమిది రోజుల పాటు ఏకాంతంగా గడిపారు. మార్స్ వాతావరణాన్ని పోలిన ప్రత్యేక ఆవాసంలో ఉంటూ శాస్త్రవేత్తలు పలు రకాల ప్రయోగాలు నిర్వహించారని అధికారులు స్పష్టం చేశారు.